PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mega47a2d52f-ce6d-430b-be06-faa59342a452-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mega47a2d52f-ce6d-430b-be06-faa59342a452-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కేంద్ర మాజీ మంత్రి, ప్రజారాజ్యం పార్టీ అధినేత అని అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి రాజకీయ జీవితం ముగించి సినిమా రంగానికి తిరిగి అంకితం అయిన సంగతీ తెలిసిందే. ఇక చిరంజీవి టాలీవుడ్ ని పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. ఆయన కరోనా టైం నుంచి కూడా సినీ పరిశ్రమ సమస్యలను తెలుసుకుని రెండు ప్రభుత్వాలకు వివరిస్తున్నారు. వారి సాయం కోరుతున్నారు.mega;chiranjeevi;kcr;nagarjuna akkineni;ankhita;jeevitha rajaseskhar;hyderabad;jagan;andhra pradesh;tollywood;industries;cinema;film industry;minister;central government;prajarajyam party;partyమళ్ళీ జగన్ తో చిరంజీవి భేటీ ?మళ్ళీ జగన్ తో చిరంజీవి భేటీ ?mega;chiranjeevi;kcr;nagarjuna akkineni;ankhita;jeevitha rajaseskhar;hyderabad;jagan;andhra pradesh;tollywood;industries;cinema;film industry;minister;central government;prajarajyam party;partyMon, 23 Nov 2020 10:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి  కేంద్ర మాజీ మంత్రి, ప్రజారాజ్యం పార్టీ అధినేత అని అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి రాజకీయ జీవితం ముగించి సినిమా రంగానికి తిరిగి అంకితం అయిన సంగతీ తెలిసిందే. ఇక చిరంజీవి టాలీవుడ్ ని పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. ఆయన కరోనా టైం నుంచి కూడా సినీ పరిశ్రమ సమస్యలను తెలుసుకుని రెండు ప్రభుత్వాలకు వివరిస్తున్నారు. వారి సాయం కోరుతున్నారు.

ఇక తాజాగా రెండు సార్లు తెలంగాణా సీఎం కేసీయార్ తో చిరంజీవి, నాగార్జున టాలీవుడ్ సమస్యల మీద భేటీ వేసి ఆయన దృష్టికి తెచ్చారు. కేసీయార్ సైతం సానుకూలంగానే స్పందించారు. మీ సమస్యలు తీరుస్తాను అంటూ గట్టి హామీనే ఇచ్చారు. అంతే కాదు హైదరాబాద్ లో నిర్మించబోయే అతి పెద్ద ఫిల్మ్ సిటీ గురించి కూడా సినీ పెద్దలతో కేసీయార్ చర్చించారని వార్తలు వచ్చాయి.

ఇవన్నీ ఇలా ఉంటే ఆ మధ్య ఏపీ సీఎం జగన్ తో కూడా టాలీవుడ్ పెద్దలు చర్చలు జరిపారు. కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్న సినీ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఇక విశాఖలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని టాలీవుడ్ కదలిరావాలని జగన్ కూడా వారికి వినతి చేశారు. ఇది జరిగి నెలలు గడుస్తోంది. ఇపుడు మరో మారు ఏపీ సీఎం జగన్ వద్దకు చిరంజీవి బృందం వస్తుందని అంటున్నారు.

ఈసారి కూడా సమస్య చిట్టాను పట్టుకుని చిరు, నాగార్జున ఇతర సినీ పెద్దలు జగన్ తో భేటీ వేస్తారని చెబుతున్నారు. విశాఖలో టాలీవుడ్ తరలింపునకు సంబంధించిన చర్చ కూడా ఈ భేటీలో వస్తుందని అంటున్నారు. అంతే కాదు కరోనా తరువాత టాలీవుడ్ అన్ని విధాలుగా దెబ్బ తిన్నందువల్ల అనేక రాయితీలు ఇవ్వాలని కూడా జగన్ని సినీ ప్రముఖులు కోరే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి త్వరలో ఈ భేటీ ఉంటుందని టాక్. మొత్తానికి ఈ భేటీ ఆసక్తికరమే.







ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>