MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adi-pinishetty-pai-manchu-manoj-fire-karanam-idenae820b1c0-9fc6-4e07-85a1-d0d372da2038-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adi-pinishetty-pai-manchu-manoj-fire-karanam-idenae820b1c0-9fc6-4e07-85a1-d0d372da2038-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి మంచి స్నేహితులు ఉంటారు..ఒకరి సినిమాలకు మరొకరు వస్తుంటారు..వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు.ఇలా చాలా మంది అగ్ర హీరోలు ఉన్నారు. అయితే కొందరు మాత్రం తన ఫ్రెండ్ కు సినిమా అవకాశాలు ఇవ్వడమే కాదు..తనకు వచ్చిన సినిమాలను కూడా వదిలేస్తారు..ఆది పిని శెట్టి, మంచు మనోజ్ ల మద్య కూడా మంచి సాన్నిత్యం ఉందన్న విషయం తెలిసిందే..నిజానికి వీళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీకి, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ఉంది.manchu manoj;editor mohan;jeevitha rajaseskhar;manchu manoj kumar;srikanth;india;adinarayanareddy;tollywood;cinema;telugu;media;tamil;twitter;kannada;hindi;director;hero;allu sneha;coffee;reddy;chitramఆది పినిశెట్టిపై మంచు మనోజ్ ఫైర్.. కారణం ఇదే..!!ఆది పినిశెట్టిపై మంచు మనోజ్ ఫైర్.. కారణం ఇదే..!!manchu manoj;editor mohan;jeevitha rajaseskhar;manchu manoj kumar;srikanth;india;adinarayanareddy;tollywood;cinema;telugu;media;tamil;twitter;kannada;hindi;director;hero;allu sneha;coffee;reddy;chitramMon, 23 Nov 2020 11:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి మంచి స్నేహితులు ఉంటారు..ఒకరి సినిమాలకు మరొకరు వస్తుంటారు..వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు.ఇలా చాలా మంది అగ్ర హీరోలు ఉన్నారు. అయితే కొందరు మాత్రం తన ఫ్రెండ్ కు సినిమా అవకాశాలు ఇవ్వడమే కాదు..తనకు వచ్చిన సినిమాలను కూడా వదిలేస్తారు..ఆది పిని శెట్టి, మంచు మనోజ్ ల మద్య కూడా మంచి సాన్నిత్యం ఉందన్న విషయం తెలిసిందే..నిజానికి వీళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీకి, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే, వీరి బిడ్డలైన మనోజ్, ఆది మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ ఎవరి జీవితం వారు గడుపుతోన్న మనోజ్, ఆది.. అప్పుడప్పుడు మోటార్‌ సైకిళ్లపై రోడ్ ట్రిప్ వెళ్తుంటారు..




ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక రోడ్ ట్రిప్ కు వెళ్లారు.. అక్కడ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేశారు.ఆ ట్రిప్ లో దిగిన ఫోటోలను ఆది తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫొటోల్లో ఆదితో తన స్నేహితులందరూ ఉన్నారు. అలాగే, సూర్యోదయం సమయంలో నదీ ప్రవాహం మీదుగా ఒక పక్షి ఎగురుతున్న ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో చాలా అందంగా ఉంది. ఈ ట్వీట్‌కు ‘సండే మార్నింగ్, రోడ్ ట్రిప్, సన్‌రైజ్, ఫ్రెండ్స్, ఫొటోగ్రఫీ, కాఫీ టాక్’ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు.ఆ పోస్ట్ కు మంచు మనోజ్ రిప్లై ఇచ్చాడు. 




ఈ అబ్బాయి నాకు బెస్ట్ ఫ్రెండ్. కానీ, అతను నా బర్డ్ ఫొటోగ్రఫీని దొంగిలించి తన ఫొటోగ్రఫీలా పోస్ట్ చేశాడు. ఇప్పుడు అతన్ని నేను ఏం చేయాలి? దయచేసిన నాకు కొన్ని సలహాలు ఇవ్వండి. జీవితాంతం అతన్ని చిత్రహింసలకు గురి చేస్తాను అని మంచు మనోజ్ పేర్కొన్నారు. దీనికి ఆది కూడా సరదాగా రిప్లై ఇచ్చారు. నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడే ఈ ఫొటోను తీశాను బాబాయ్. నువ్వు తీసిన ప్రతి ఫోటో కాఫీ రైట్స్ నావే అన్న సంగతి మర్చిపోవద్దు.. నువ్వే నా బెస్ట్ అయినప్పుడు నేను కూడా నీకు సొంతం అనే కదా అంటూ ఆది అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.. మొత్తం మీద అలా సరదాగా కాసేపు అని చాట్ చేసుకున్నారు.ప్రస్తుతం మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో బిజీగా ఉన్నారు. సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రంగా ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. ఆయనే హీరో. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ‘అహం బ్రహ్మాస్మి’ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

" style="height: 209px;">



జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>