Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/operation8159df10-af46-405c-9be8-9761566b112d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/operation8159df10-af46-405c-9be8-9761566b112d-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎంత ధైర్యవంతుడు అయినా సరే ఏదైనా సమస్య వచ్చి సర్జరీ చేయించు కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం కాస్త భయపడిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. డాక్టర్లకు కొన్ని కొన్ని సార్లు కొన్ని సర్జరీలు చేయడం కూడా ఎంతో క్లిష్టంగా మారిపోతూ ఉంటాయి. దీనికోసం ఎంతో వినూత్నంగా ఆలోచించి డాక్టర్లు-రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ డాక్టర్లు ఇదే చేశారు. ఏకంగా బ్రెయిన్ సర్జరీ చేసేందుకు ఎంతగానో శ్రమించారు. అయితే బ్రెయిన్ సర్జరీ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా మెదడు పని చేస్తూ ఉండాbigboss;cinema;bigboss;tumor;avatar;helloబిగ్ బాస్ షో చూపిస్తూ.. సర్జరీ చేసిన వైద్యులు.. చివరికి..?బిగ్ బాస్ షో చూపిస్తూ.. సర్జరీ చేసిన వైద్యులు.. చివరికి..?bigboss;cinema;bigboss;tumor;avatar;helloSat, 21 Nov 2020 12:00:00 GMT


 ఏకంగా మెదడు పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సదరు బాధితుడికి బిగ్ బాస్ షో చూపించడంతో పాటు అవతార్  సినిమా చూపించి సర్జరీ పూర్తి చేశారు డాక్టర్లు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పెదకూరపాడు మండలం పాటిబండ్ల కు చెందిన వరప్రసాద్ కు  బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 2016లో రేడియేషన్ తో  కణితిని తొలగించారు. కానీ మళ్ళీ ఆరు నెలల నుంచి తరచూ  ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెదడులో కణితి మళ్ళీ పెరిగినట్లు గుర్తించారు. సర్జరీ చేసి తొలగించాలని భావించారు.



 ఇక సున్నితమైన కీలకమైన ప్రాంతంలో  కణతి ఉండడంతో... రోగి స్పృహలో ఉన్నప్పుడే సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో డాక్టర్లు వినూత్నంగా ఆలోచించారు.. సదరు రోగి మెలకువగా ఉండడం కోసం బిగ్ బాస్ షో ని చూపించడంతో పాటు అవతార్ సినిమా కూడా చూపించారు. అంతేకాదు ఆ రోగికి పైసా ఖర్చు లేకుండానే బీమా సౌకర్యం తో సర్జరీ నిర్వహించారు వైద్యులు. సర్జరీ విజయవంతం అవడంతో కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకున్న రోగి ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు వెల్లడించారు.


మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>