BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/old-records-broken-by-obama-a-promised-land68617d59-a5cd-4f15-b53e-89ef7dfda660-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/old-records-broken-by-obama-a-promised-land68617d59-a5cd-4f15-b53e-89ef7dfda660-415x250-IndiaHerald.jpgఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జీవితంలో జరిగిన సంఘటనలు, రాజకీయ అనుభవాలను ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం నవంబరు 17న మార్కెట్‌లోకి విడుదల కాగా.. రికార్డుస్థాయిలో అమ్ముడవుతోంది. కేవలం 24 గంటల్లోనే 890,000 కాపీలు అమెరికా, కెనాడాలో అమ్ముడయ్యాయి. దీంతో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.obama;jeevitha rajaseskhar;american samoa;barack obama;jaan;love;wife;contract;house;father;john;newyorkగత రికార్డులను బ్రేక్ చేసిన ఒబామా " ఏ ప్రామిస్డ్ లాండ్"!గత రికార్డులను బ్రేక్ చేసిన ఒబామా " ఏ ప్రామిస్డ్ లాండ్"!obama;jeevitha rajaseskhar;american samoa;barack obama;jaan;love;wife;contract;house;father;john;newyorkThu, 19 Nov 2020 16:10:00 GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జీవితంలో జరిగిన సంఘటనలు, రాజకీయ అనుభవాలను ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం నవంబరు 17న మార్కెట్‌లోకి విడుదల కాగా.. రికార్డుస్థాయిలో అమ్ముడవుతోంది. కేవలం 24 గంటల్లోనే 890,000 కాపీలు అమెరికా, కెనాడాలో అమ్ముడయ్యాయి. దీంతో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. పుస్తకాన్ని ముద్రించిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకారం.. ఆధునిక చరిత్రలో ఏ దేశాధినేత రాసిన పుస్తకం కూడా ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడయిన దాఖలాలు లేవు.

న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన ప్రచురణ కర్తల సమాచారం ప్రకారం.. రెండేళ్ల కిందట బారక్ ఒబామా భార్య మిచెల్లీ ఒబామా రాసిన ‘బికమింగ్’ ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యింది. ఒబామా 1995లో రాసిన ‘డ్రీమ్ ఫ్రమ్ మై ఫాదర్’ 3.3 మిలియన్లు, 2006లో రాసిన ‘ది అడాసిటీ ఆఫ్ హోప్’4.3 మిలియన్ల అమ్ముడుపోవడం విశేషం. ఒబామా తన పుస్తకంలో భారత్‌ గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. దేశంలోని రాజకీయ నేతలు సహా రామాయణ, మహాభారతాల గురించి కూడా ఒబామా చర్చించారు. ఇదిలా ఉండగా.. 2017లో ఒబామా దంపతులు తమ పుస్తకం కోసం 65 మిలియన్ల డాలర్ల ఒప్పందం చేసుకున్నారు. ఇదే అతిపెద్ద ఒప్పందంకాగా.. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ‘మై లైఫ్’ కోసం 15 మిలియన్ డాలర్లు, హిల్లరీ క్లింటన్ ‘హార్డ్ ఛాయిసెస్’ 14 మిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పోప్ జాన్ పాల్ 2 రాసిన 1994లో ‘క్రాసింగ్ ది థ్రెషోల్డ్ ఆఫ్ హోప్’ 8.5 మిలియన్ డాలర్లు, 2006లో అలెన్ గ్రీన్ స్పాన్ రాసిన ‘ది ఏజ్ ఆఫ్ టర్బులెన్స్’ 8.5 మిలియన్ డాలర్లు, 2016లో బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ ‘బోర్న్ టూ రన్’ 10 మిలియన్ డాలర్లు , 2015లో అమీ చుమేర్ రాసి ‘ది గర్ల్ విత్ ది లవ్ బ్యాక్ ట్యాటూ’ 9 మిలియన్ డాలర్లు, 2010లో కేత్ రిచర్డ్స్ రాసిన ‘లైఫ్’ పుస్తకం 7.3 మిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>