టాలీవుడ్ లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలు తమ పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మెగాస్టార్ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా..ఈ హీరోలు తమ టాలెంట్ చూపిస్తూ..మంచి విజయాలు అందుకుంటున్నారు. పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ లు టాప్ హీరోలుగా ఉన్న సమయంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
అయితే అల్లు వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దూసుకు వెళ్తున్నారు. అయితే బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ‘గౌరవం ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..కానీ మనోడు హీరోగా పెద్దగా రాణించలేక పోతున్నాడు. తాజాగా యువ హీరో అల్లు శిరీష్ తన చిన్ననాటి ఫొటోలను పోస్ట్ చేశాడు. తన అన్నయ్య అల్లు అర్జున్, తాను కలసి కుంగ్ ఫూ నేర్చుకుంటూ చిన్నప్పుడు దిగిన ఈ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
తాను కుంగ్ ఫూ నేర్చుకున్నప్పుడు దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ, ఈ ఫొటోల్లో తమతో పాటు మరో నటుడు కూడా ఉన్నాడని, ఎవరో ఊహించండి? అని అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు.నాడు ఎంతో బొద్దుగా ఉన్న తాను కుంగ్ ఫూ నేర్చుకోవడం ద్వారా ఫిట్ నెస్ పొంది తన రూపాన్ని మార్చుకున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
ఇరవై ఏళ్ల క్రితమే ‘సరైనోడు’ సినిమా క్లైమాక్స్ దేవుడికి తెలిసుండచ్చని శిరీష్ చమత్కరించాడు. కాగా, 'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, ఆది విలన్ పాత్రలో నటించాడు.
I was a fat kid!!! And proud of my transformation. Hahaha. 😂💪 https://t.co/GahICkVjta
— Allu Sirish (@AlluSirish) February 13, 2018
Who knew God had designed the climax of #Sarrainodu 20 years back itself? ;) @alluarjun @AadhiOfficial pic.twitter.com/t280up3wev
— Allu Sirish (@AlluSirish) February 14, 2018